ap high court -navayugaనిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో బందరు పోర్టు కోసం నవయుగ కంపెనీకి ఇచ్చిన 412.5 ఎకరాలను వెనక్కు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తలుపు తట్టింది నవయుగ. పోర్టుపనుల కోసం భూములను అప్పగించటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఒప్పందం రద్దు సరికాదని సూచించింది. ఈ ప్రాజెక్టు పై ఇప్పటికే 436 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.

అయితే హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. న్యాయవాదుల విధుల బహిష్కరణ కారణంగా విచారణ వాయిదా పడింది. జీవో 66ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని సంస్థ కోరింది. పోర్టుపనుల కోసం భూములను అప్పగించటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఒప్పందం రద్దు సరికాదని సూచించింది. నవయుగకే చెందిన పోలవరం హైడల్ ప్రాజెక్టు టెండర్లను కూడా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

గతంలో వాన్ పిక్ పోర్టు సిబిఐ వివాదాలలో చిక్కుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులో 65% షేర్ కలిగిన నవయుగ తన షేర్ ను అమ్మేసుకుని ఆ ప్రాజెక్టు నుండి బయటపడింది. నవయుగ తన వాటా ను యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా కు అమ్మేయడం ఆ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు కావడం తెలిసిందే. దానివల్ల జగన్ కేసులు మరింత సంక్లిష్టంగా మారాయని, అందుకోసమే ముఖ్యమంత్రి తమ కంపెనీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కంపెనీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.