navadeep entry in bollywoodతెలుగు హీరో నవదీప్‌ సక్సెస్‌ కోసం పట్టు వదలని విక్రమార్కుడిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవేవి సక్సెస్‌ అవ్వలేదు. ఈయన నటించిన ‘చందమామ’ చిత్రం తప్ప మరే చిత్రాలు కూడా కమర్షియల్‌గా ఈయనకు సక్సెస్‌ను తెచ్చి పెట్టలేక పోయాయి. దాంతో ఈయనకు ఆఫర్లు రావడమే తగ్గి పోయాయి. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయినా కెరీర్‌ సాగించాలని చూసిన నవదీప్‌కు టాలీవుడ్‌లో చేదు అనుభవమే ఎదురు అయ్యింది. దాంతో నవదీప్‌ హిందీలో ఒక రాయి వేద్దాం అని ప్రయత్నించాడు.

నవదీప్‌కు అదృష్టం కలిసి వచ్చి హిందీలో ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమాలో ముఖ్య పాత్రలో నటించబోతున్న నవదీప్‌కు హిందీలో మంచి ఎంట్రీ లభిస్తే అక్కడ వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. చూద్దానికి నార్త్‌ ఇండియన్‌ యాక్టర్‌లా కనిపించే నవదీప్‌ హిందీలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పర్చుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. మరి అది సాధ్యం అయ్యేనో చూడాలి.