YS Jagan - Chandrababu - Naidu-Pawan -KalyanYS Jagan - Chandrababu - Naidu-Pawan -Kalyanఆంధ్రప్రదేశ్ మరొక నాలుగైదు నెలలలో ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఇటీవలే కాలంలో జాతీయ మీడియా ఛానెళ్ళు నెలకోసారి దేశవ్యాప్త సర్వేలు అంటూ ఊదరగొడుతున్నాయి. గత కొద్ది నెలలుగా ఈ సర్వేలలో వైకాపాకు అనుకూలంగా ఫలితాలు రావడం విశేషం. అయితే ఈ సర్వేలు నిజంగానే పబ్లిక్ పల్స్ ను అంచనా వెయ్యగలవా అంటే చరిత్ర చూస్తే దక్షిణాదిన అందునా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఈ సర్వేలు అంతగా ఖచ్చితంగా లేవని చెప్పక తప్పదు.

అయితే ఇటీవలే తెలంగాణ పల్స్ ను బాగానే పట్టాయి. అయితే అక్కడ తెరాసకు అనుకూల పరిస్థితులతో పాటు ప్రతిపక్షాల అసహాయత వల్ల కావచ్చు. 2013 నుండి ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చిన జాతీయ మీడియా అంచనాలన్నీ జగన్ కు అనుకూలంగానే ఉన్నాయి. అయితే 2014లో ఏం జరిగిందో మన అందరికీ తెలియనిది కాదు. ప్రశాంత్ కిషోర్ సాయంతో ఈ సర్వేలు మానిప్యులేట్ అవుతున్నాయి అని టీడీపీ నాయకుల వాదన. వారి ఆరోపణలు ఎలా ఉన్నా ఈ సర్వేల అంచనాలలో కొన్ని అనుమానాలు ఉన్న మాట వాస్తవమే.

ఇటీవలే వచ్చిన రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం వైకాపాకు 14 సీట్లు… టీడీపీ + కాంగ్రెస్ కు 11 సీట్లు వస్తాయని చెప్పింది. వైకాపాకు 41.6% ఓటు షేర్ ఇవ్వగా టీడీపీ + కాంగ్రెస్ కు 38.2% ఇచ్చింది. ఇది ఎలా ఉన్నా బీజేపీకి ఏకంగా 11% ఓటు ఉందని చెప్పడం విడ్డురం. ఇదే సమయంలో అసలు జనసేనను పట్టించుకోకుండా ఆ పార్టీని ఇతరులలోకి గెంటేసి నామమాత్రంగా 9.3%. ఇతరులలో ఇండిపెండెంట్లు, కమ్యూనిస్టులు కూడా ఉంటారని గుర్తుంచుకోవాలి. మొత్తంగా జనసేన ఖాతాలోకి వేసేసిన బీజేపీ కంటే తక్కువ రావడం జరగని పని.

బీజేపీ ఎంతో కొంత బలంగా ఉన్నది తెలంగాణాలో… అక్కడ కొంత మంది మంచి కాండిడేట్లను నిలబెట్టగలిగింది కూడా. అయినా అక్కడ ఆ పార్టీకి వచ్చింది 8% ఓటు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేహ్స్ లో అంత కంటే ఎక్కువ రావడం అసంభవం. ఇప్పుడు ఆ పార్టీ చాలా గడ్డు పరిస్థితి ఎదురు కుంటుంది. దీని బట్టి జాతీయ మీడియా సర్వేలు తమ అంచనాలలో తడబడుతున్నాయి లేకపోతే ఒక ప్రణాళిక ప్రకారం టీడీపీ ఓడిపోతుంది అనే ఒపీనియన్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి అనుకోవాలా?