Green Tribunal stays constructions in Amaravatiనవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి మరోమారు ‘పర్యావరణ’ ముప్పు పొంచి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున గల తుళ్లూరు పరిసర ప్రాంతాల్లోని పంట భూములలో రాజధాని ఎలా కడతారంటూ సామాజికవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

రాజధాని నిర్మాణానికి ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి’ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని దాఖలైన ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ట్రైబ్యునల్ ఏప్రిల్ 4వ తేదీన విచారించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులను శర్మ ప్రతివాదులుగా పేర్కొన్నారు. సిరులు పండే భూముల్లో రాజధాని ఎలా కడతారని ప్రశ్నిస్తున్న శర్మ, రాజధానిని 23 గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.