National Green Tribunal breaks to pattiseemaఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని పర్యావరణ అనుమతుల్లేని ఎత్తిపోతల పథకాలను ఆపాలని ఎన్జీటీ ఆదేశించింది. గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరింది. పర్యావరణ అనుమతలు తీసుకున్నాకే ఆయా పథకాలను నడపాలని ఆదేశించింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ మరొకరు ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై గతంలోనే విచారణ చేపట్టిన ఎన్జీటీ.. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే మీరేం చేస్తున్నారంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య మండల్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిపై ఆయా బోర్డులతో ఓ సంయక్త కమిటీని నియమించి నష్టాన్ని అంచనావేసి నివేదిక ఇవ్వాల్సిందిగా నాలుగు వారాల సమయమిచ్చింది. తాజాగా ఆ కమిటీ నివేదిక అందజేసింది. దీనిపై విచారణ చేపట్టిన జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది. దీనితో రాష్ట్రప్రభుత్వం ఇరకాటంలో పడినట్టు ఉంది. గత ప్రభుత్వం హయాంలో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులు చాలా ఉపయోగంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు…. ఇప్పుడు వీటికి బ్రేక్ పడటం ప్రభుత్వానికి ఇబ్బందే. మరోపక్క ఈ తీర్పుపై జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ లో అప్పీల్ చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది.