natakam-movie-official-teaserఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలు ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు అయ్యాయని ప్రేక్షకులకు విసుగువచ్చేలా అవే రకపు సినిమాలను దర్శకనిర్మాతలు ఎంచుకున్నారు. ఆ తర్వాత కామెడీ… ఆ తర్వాత ఇంకోటి, మరొకటి… ఇలా అప్పటి ట్రెండ్ లో ఏది హిట్టయితే అవే కధలతో సినిమాలను తెరకెక్కించడం ఇండస్ట్రీ జనులకు సర్వసాధారణం.

ఆ క్రమంలోనే నేడు మరో “నాటకం” సిద్ధమవుతోంది. నేటి ట్రెండ్ అయిన ‘గ్రామీణ వాతావరణం… హీరోకు గడ్డం… లుంగీ కాస్ట్యూమ్స్… హీరోయిన్ బోల్డ్ డైలాగ్స్… లిప్ లాక్ సీన్స్’లను సమ్మేళనం చేస్తూ ఈ “నాటకం” టీజర్ రిలీజ్ అయ్యింది. దీని గురించి ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే… ‘సన్నాఫ్ ఆర్ఎక్స్ 100’ అనో ‘బ్రదర్ అఫ్ ఆర్ఎక్స్ 100’ అనో కీర్తించాలి.