Narudi Brathuku Natanaలాక్ డౌన్ లో తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్న యువ హీరో… సిద్ధు జొన్నలగడ్డ. లాక్ డౌన్ సమయంలో అతనికి సంబంధించిన రెండు సినిమాలు … కృష్ణ అండ్ హిస్ లీలా అలాగే మా వింత గాథ వినుమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓటీటీలో సినిమా రేంజ్ ఏంటనేది చెప్పలేం గానీ ప్రేక్షకులలో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు.

అయితే ఇప్పుడు థియేటర్ల లో సినిమాలు వస్తాయి కాబట్టి సరైన ప్లాన్నింగ్ తో ముందుకు వస్తున్నాడు ఈ యువ హీరో. తన తదుపరి చిత్రం… సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ … సితారా ఎంటర్టైన్మెంట్ తో చేస్తున్నాడు. సినిమా నిర్మాణం నుండి రిలీజ్, ప్రమోషన్ల వరకు కంప్లీట్ గా కేర్ తీసుకునే సంస్థ ఇది. వారి నుండి వచ్చే సినిమాలు గ్రాండ్ గా కూడా ఉంటాయి.

కాబట్టి అతను సెక్యూరెడ్ అనే చెప్పవచ్చు. నరుడు బ్రతుకు నటన అనే పేరు తో వస్తున్న ఈ చిత్రానికి ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా తయారువుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం అవుతుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. గత రెండు సినిమాల వలే ఈ సినిమాకు కూడా సిద్దు జొన్నలగడ్డ రైటర్ గా కూడా ఉన్నాడు.