Nartanasala-First-Look‘ఛలో’ సినిమా సక్సెస్ తో యువహీరో నాగశౌర్య (అమ్మమ్మ గారిల్లు ఫ్లాప్ అయినప్పటికీ) మంచి హుషారులో ఉన్నాడు. ఆ జోష్ అంతా ఇపుడు “నర్తనశాల” ఫస్ట్ లుక్ లో కనపడుతోంది. పంచెకట్టుతో దూకుతూ వస్తోన్న శౌర్య లుక్ బాగుంది.ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ చక్రవర్తి అనే నూతన దర్శకుడు పరిచయం అవుతుండగా, నాగశౌర్య సొంత బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది.

‘ఛలో’ సినిమాతో హీరోగానే కాక, నిర్మాతగా కూడా సక్సెస్ అయిన శౌర్య, అదే ఊపులో ‘నర్తనశాల’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, యామిని, కాశ్మీరాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.