Malli Pelli Movie Talkఅసలు స్టార్ అట్రాక్షన్ లేకుండా కనీసం యూత్ అండ్ ఫ్యామిలీ ఫ్లేవర్ లేకుండా ఒక సినిమా జనం దృష్టిలో పడ్డదంటే అది మళ్ళీ పెళ్లి విషయంలోనే జరిగింది. నరేష్ పవిత్ర లోకేష్ ల వివాదాస్పద బంధాన్ని కొన్ని నెలలుగా అతి దగ్గరగా చూడటం వల్ల ఇందులో తమకు తెలియని కొత్త విషయాలు ఏమైనా చూపిస్తారేమోననే ఆసక్తి ఆడియన్స్ లో కనిపించింది. ఆలా అని హౌస్ ఫుల్స్ అయ్యే ఓపెనింగ్స్ ఏమి రాలేదు కానీ ఉన్నంతలో ఏజ్ బార్ జంటను చూసేందుకు ఈ మాత్రం జనం వచ్చారంటే క్రెడిట్ నరేష్ కే దక్కుతుంది.

ఇందులో మనకు తెలిసిన కథకే కొన్ని కొత్త సీక్రెట్స్ జోడించారు. నరేష్ పవిత్ర లోకేష్ పరస్పరం సెట్లో కలుసుకుని ఒకరినొకరు ఇష్టపడటం వాళ్లే ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి ఇక్కడ కొత్త పాయింట్ ఏమి లేదు. కానీ నరేంద్ర(హీరో పాత్ర పేరు) మూడో భార్యను ఎక్కడ ఎలా కలుసుకుని పెళ్లి చేసుకున్నాడు, పార్వతి(హీరోయిన్ పేరు) ఫ్లాష్ బ్యాక్ ఏంటి, భర్తతో ఎందుకు పొసగలేదు లాంటి విషయాలను ఇందులో టచ్ చేశారు. సహజంగానే ఉన్న బాండింగ్ వల్ల లీడ్ పెయిర్ నటించడం కాదు చక్కగా జీవించేశారు.

Also Read – పాదయాత్రకు రెండు సాకులతో జగన్‌ సిద్ధం

దర్శకులు కం రచయిత ఎంఎస్ రాజు ఈ మళ్ళీ పెళ్లిని ఎంగేజింగ్ స్క్రీన్ ఎఫైర్ గా మార్చడంలో తడబడ్డారు. కొన్ని కీలక సన్నివేశాలు మినహాయించి దాదాపు ముప్పాతిక శాతం స్క్రీన్ ప్లే చాలా చప్పగా నీరసంగా సాగుతుంది. నరేష్ వ్యక్తిగత జీవితం ఆల్రెడీ మనకు తెలిసినప్పుడు వీలైనంత వరకు ఆ ట్రాక్ తాలూకు సీన్లు వేగంగా పరిగెత్తించాలి. దానికి బదులు ఏదో ఎమోషన్ తో చెప్పాలనే ఉద్దేశంతో డిటైల్డ్ గా నడిపించడంతో కథనం నత్తనడక సాగి విపరీతమైన బోర్ కొట్టిస్తుంది. అంతో ఇంతో సెకండ్ హాఫ్ లో కొంత భాగం నయం.

మళ్ళీ పెళ్లి పూర్తిగా నరేష్ పవిత్రల పాజిటివ్ వెర్షన్ లో చెప్పాలని చేసిన ప్రయత్నమే. చాలా చాకచక్యంగా మొదటి ఇద్దరి భార్యల ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. ఆల్రెడీ హీరోగా కొన్ని సినిమాలు చేసిన నరేష్ పెద్ద కొడుకుని ఎక్కడా చూపించకుండా జాగ్రత్త పడ్డారు. కృష్ణ, విజయనిర్మల పాత్రలు పోషించిన జయసుధ, శరత్ బాబులు నరేష్ ని చాలా ఉన్నతంగా చూశారనే భావన కలిగించారే తప్ప ఇన్ని వివాహాలు ఎందుకు వైఫల్యం చెందాయనే దాని మీద ఎక్కడా చర్చ రాలేదు. ఇదంతా వన్ సైడ్ వెర్షన్ లో సాగిన మెలోడ్రామా.

Also Read – ఇంకా తత్త్వం బోధ పడలేదా..? ఇప్పటికైనా కళ్ళు తెరవండి.!

ఆకర్షణీయమైన జంట లేనప్పుడు ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే బలీయమైన నాటకీయత కావాలి. కానీ మళ్ళీ పెళ్లిలో పది ఇరవై శాతం తప్ప ఇంకెక్కడా ఆ ఊసే ఉండదు. పార్వతి గతాన్ని రివీల్ చేసినప్పుడు కూడా మొగుడే విలనని చూపించడం, ఎవరెవరో తమ మీద కుట్రలు చేశారని చూపించడం ఎంత సినిమాటిక్ గా ఉన్న పూర్తిగా నమ్మేలా మాత్రం లేవు. వీళ్ళ జంట మీద విపరీతమైన ఆసక్తి ఉంటే తప్ప మళ్ళీ పెళ్లిని థియేటర్ లో భరించడం కష్టం. రీల్ కు రియల్ కు మధ్య నలిగిపోయిన లవ్ స్టోరీకి సానుభూతి కష్టమే.

Also Read – విలువలు విశ్వసనీయత: జగన్ మళ్లీ అదే పాట!