narendra modi ys jagan freebies అవును… ఏపీలో జగన్ సర్కార్‌ అమలుచేస్తున్న సంక్షేమ పధకాలకు రాష్ట్ర ఆదాయం సరిపోదు కనుక అప్పులు చేస్తోంది. అయితే జగన్ సర్కార్‌కున్న క్రెడిట్ రేటింగ్ చూసి ఏ ఆర్ధిక సంస్థ అప్పులు ఇచ్చే దుస్సాహాసం చేయదు కనుక మద్యలో ప్రధాని నరేంద్రమోడీ ‘నేనున్నాను…’ అంటూ అభహస్తం ఇచ్చి ఏపీకి అప్పులు ఇప్పిస్తుంటారు.

ఆవిదంగా తెచ్చుకొన్న అప్పులకి జగనన్న తన ముద్ర వేసుకొని సంక్షేమ పధకాల పేరుతో తమ పార్టీకి ఓట్లు వేస్తారనే నమ్మకం ఉన్న వర్గాలకు లేదా ఓటర్లకు రకరకాల పేర్లతో పంచిపెడుతుంటారు.

వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్న ఆ లక్షల కోట్ల అప్పులన్నిటినీ జగనన్న తీర్చడు… వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీర్చరు. కనీసం అభయహస్తం ఇచ్చి అప్పులు ఇప్పిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కానీ కేంద్ర ప్రభుత్వంగానీ తీర్చదు.

మరెవరూ తీర్చుతారు?అంటే సంక్షేమ పధకాల లబ్దిదారులు, ఆ పధకాలు పొందని మిగిలిన ప్రజలే! విద్యుత్ చార్జీల పెంపు, ఇంటి పన్ను పెంపు, చెత్తపన్ను వంటి రకరకాల పేర్లతో ప్రజల వద్ద నుంచే ఆ సొమ్మును వసూలు చేస్తుండటం అందరికీ తెలుసు. కానీ ఆ సొమ్ముతో అప్పులన్నీ తీర్చేయడం సాధ్యం కాదు కనుక వాటికి నెలనెలా టంచనుగా వడ్డీలు చెల్లిస్తే చాలు మళ్ళీ కొత్త కొత్త అప్పులు లభిస్తూనే ఉంటాయి.

“మేము ఈవిదంగా ఎడాపెడా అప్పులు చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మమ్మల్ని ఎందుకు వారించడం లేదు? కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు చూస్తూ ఊరుకొంటున్నారు?మేము ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోతే రిజర్వ్ బ్యాంక్ కళ్ళు మూసుకొని కూర్చోందా?” అంటూ పేర్నినాని అని ఎదురు ప్రశ్నించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ ఆయన ప్రశ్నకు వారి వద్ద సమాధానం ఉండదు కనుక కేంద్ర ప్రభుత్వమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.

అయితే వైసీపీ తన రాజకీయ అవసరాలు లేదా ప్రయోజనాల కోసం ఏవిదంగా అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలుచేస్తోందో, అదేవిదంగా కేంద్ర ప్రభుత్వం కూడా తమ అవసరాల కోసం, ఏపీలో బిజెపి ప్రయోజనాల కోసం జగన్ సర్కార్‌కు అయినకాడికి అప్పులు చేసుకొనేందుకు సహాయపడుతోందని భావించవచ్చు. కనుక బిజెపి, వైసీపీ రెండూ తలో చెయ్యి వేసి ఏపీని ఉద్దరిస్తున్నాయని సరిపెట్టుకోవాలన్న మాట!

తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు, ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన కోసం అప్పులు చేసి వాటి ద్వారా వచ్చే సంపదను సంక్షేమ పధకాల రూపంలో ప్రజలకు పంచిపెట్టి ఓట్లు అడుగుతోంది. కనుక తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేస్తున్నా అక్కడి ప్రజలు పెద్దగా అభ్యంతరాలు చెప్పడం లేదు. కానీ ఏపీలో జగన్ సర్కార్‌ మాత్రం అప్పుల సొమ్మును నేరుగా సంక్షేమ పధకాలకి, వాటి ప్రచారానికే వినియోగిస్తోంది. అవన్నీ గొడకేసిన సున్నం వంటివే. మళ్ళీ తిరిగివచ్చేవి కావు. కానీ ఈ సంక్షేమ పధకాల అప్పుల భారం మాత్రం ఏపీ ప్రజలు నెత్తిపై మోయాల్సిందే జగనన్న ప్రభుత్వం ఉన్నా వెళ్ళిపోయినా సరే!