Narendra Modi - YS Jagan - Coal Stock - Andhra Pradesh -Power Cutsదేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా విద్యుత్తు సంక్షోభం ఎదురుకాబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ సంక్షోభం మరింత తీవ్రం కాబోతుంది. కనీసం మూడు గంటల అధికారిక కోతలకు రాష్ట్రం సిద్ధం అవుతుంది.

ఓపెన్ మార్కెట్ లో బాగా హెచ్చు ధరలకు విద్యుత్తు దొరుకుతున్నా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కొనలేని పరిస్థితి. సింగరేణి లో బొగ్గు అందుబాటులో ఉన్నా పాత బకాయిలు ఇస్తే గానే తెచ్చుకోలేని పరిస్థితి.

ఇక పోతే… విద్యుత్తు సంక్షోభం గురించి కేంద్రం 40 రోజుల ముందే రాష్ట్రాన్ని హెచ్చరించిందట. బొగ్గు నిల్వలు రెడీ చేసుకోమని ఒక లేఖ రాసింది. అయితే పూర్తిగా తాయిలాల పంచుడే ప్రధానంగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇప్పుడు కొరత దేశవ్యాప్తంగా ఉన్నా దాని ఎఫెక్ట్ మాత్రం జగన్ ప్రభుత్వమే భరించాలి. ఏ రాష్ట్రంలోనైనా ఇదే పరిస్థితి అయితే జగన్ ప్రభుత్వం మీద ఉన్న ‘తాయిలాల వరకే’ ఇంప్రెషన్ కారణంగా ఆ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉండబోతుంది.

2021లో కూడా పవర్ కట్స్ అంటే జనాలు తట్టుకునే పరిస్థితి లేదు. కారణం ఏదైనా అందుకు మూల్యం మాత్రం జగన్ ప్రభుత్వమే చెల్లించాలి. ఇప్పటికే ఈ ఇష్యూ మీద ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని గట్టిగానే తగులుకుంటున్నాయి.