Narendra - Modi - YS Jaganమరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని తరలింపు, మండలి రద్దు వంటి విషయాల నేపథ్యంలో వీరిద్దరి భేటీ మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో మోడీ వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎన్డీయేలోకి ఆహ్వానించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

కొందరైతే ఏకంగా విజయసాయి రెడ్డి, నందిగామ సురేష్ లను కేంద్ర కేబినెట్లో కి తీసుకుని అవకాశం కూడా ఉందంటున్నారు. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల నాటి నుండి ఒక అండర్ స్టాండింగ్ మీదనే ఉన్నాయి. అయితే పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా అనేదాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్డీయేలో చేరితే ఆ పార్టీకి తొలుత నుండీ వెన్నుదన్నుగా ఉన్న మైనారిటీలు, దళితులు దూరం అయ్యే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉండటంతో జగన్ ఈ తరుణంలో ఇటువంటి చర్యకు పూనుకుంటారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల నాటి నుండి ఒక అండర్ స్టాండింగ్ మీదనే ఉన్నాయి. ఈ తరుణంలో పొత్తుకు తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. మరోవైపు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమై వచ్చే నెల 15లోగా స్థానిక, మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చెయ్యాలని నిర్ణయించింది.