Narendra Modi tweets in teluguప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి రోజు ఉదయం తన అధికారిక ట్విట్టర్ అకౌంటు నుండి ఆయన రాష్ట్రాల ప్రజలకు వారి పండుగలకు విష్ చెయ్యడం ఎప్పుడూ జరిగే ప్రక్రియ. కాకపోతే ఎందుకో ఆయనకు తెలుగంటే కాస్త చులకన. ఒక్కోసారి తెలుగు పండుగలను మర్చిపోవడం, తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో విష్ చెయ్యడం వంటివి గతంలో చేసి విమర్శల పాలయ్యారు. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేళ ఆయనకు తెలుగు మీద మమకారం పొంగుకొచ్చింది.

“నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెcట్టడానికి ఎంతో ఆసక్తిగా, ఎదురు చూస్తున్నాను… మొదటగా నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్ నగర్ లో మీతో నా భావాలు పంచుకొంటాను. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను. NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి,” అంటూ తన ట్విట్టర్ అకౌంట్ నుండి చిలక పలుకులు పలికారు మోడీ గారు.

ఉగాది కి మరచి పోయిన తెలుగు , సంక్రాంతి కి గుర్తు రాని తెలుగు నేడు ఎన్నికల వేళ గుర్తొచ్చింది. నిజంగానే మన దేశం లో ఎన్నికలు పెద్ద పండగలు అంటూ ఒక ఆయన ప్రధానికి తత్వం బోధ పడేలా చేశాడు. తెలంగాణలో ప్రధాని మోదీ మొత్తం మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. వీటిలో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్‌, దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్‌ సభలు ఈరోజు జరగనుండగా డిసెంబరు 3న హైదరాబాద్‌లో మోదీతో భారీ బహిరంగసభను నిర్వహించాలని భాజపా నిర్ణయించింది.