Narendra - Modiఇండియాలో డిజిట‌ల్ టెక్నాల‌జీని విప్ల‌వాత్మ‌కంగా ఉప‌యోగించే నాయ‌కుడు అంటే న‌రేంద్ర మోదీ పేరు మాత్ర‌మే ముందు వినిపిస్తుంది. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో డిజిట‌ల్ టెక్నాల‌జీని అత్య‌ధికంగా ఉపయోగించి కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు త‌న ఉప‌న్యాసాలు చేరుకునేలా చేసిన రికార్డు ఆయ‌న సొంతం. ప్ర‌ధాన మంత్రి అయిన త‌రువాత సోష‌ల్ నెట్ వ‌ర్క్ ను ఉప‌యోగించ‌డంలో మోదీ జోరు మరింత పెరిగిందే కానీ…త‌గ్గ‌లేదు. ఏకంగా ఆయ‌న పేరు మీద ఒక యాప్ నే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

ఇక ట్విట‌ర్ లో మోదీ కి ఎదురు లేదు. అమితాబ‌చ్చ‌న్.. స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపిక ప‌దుకోణ్ , షారుక్ ఖాన్ వంటి సూప‌ర్ స్టార్స్ ను మించి మ‌న ప్ర‌ధాన మంత్రి మోదీని ట్విట‌ర్ లో 3 కోట్ల 75 ల‌క్ష‌ల మంది అనుస‌రిస్తున్నారు. ఈ విష‌యంలో మోదీ కి ద‌రి దాపుల్లో కూడా ఎవ‌రు లేరు అంటే ఆయ‌న చ‌రీష్మా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇండియ‌న్ టాప్ 10 పొలిటిక‌ల్ అండ్ ఫిల్మ్, స్పోర్ట్స్ ట్విట‌ర్ సెలిబ్రిటీస్ లో ప్ర‌ధాన మంత్రి మోదీ నెం1 స్థానంలో ఉన్నారు. . ఆ త‌రువాత వ‌ర‌స‌గా 7 వ‌స్థానం వ‌ర‌కు అమితాబ్, షారుక్, స‌ల్మాన్, అక్ష‌య్ కుమార్, అమీర్ ఖాన్ , దీపిక ప‌దుకోణ్ ఉన్నారు. 8 వ స్థానంలో స్పోర్ట్స్ దిగ్గ‌జం స‌చిన్ 2. కోట్ల 17 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ తో ఉన్నాడు. 9 వ స్థానంలో హృతిక్ ఉండ‌గా.. చివ‌రి స్థానంలో క్రికెట్ డాషింగ్ బ్యాట్సెమెన్ విరాట్ కోహ్లీ 2 కోట్ల , 8 ల‌క్ష‌ల మంది ఫాలో వ‌ర్స్ తో 10 వ స్థానంలో వున్నాడు. సినిమా , స్పోర్ట్స్ స్టార్ ల‌ను మించిన చ‌రిష్మా మ‌న ప్రధాన మంత్రి మోదీ గారి సొంతం అని ఈ ట్విట‌ర్ స‌ర్వే చెప్ప‌క‌నే చెప్పింది క‌దా.!