Narendra Modi to address the nation on lockdown extensionరేపటితో దేశంలో విధించిన మూడు వారాల లాక్ డౌన్ పూర్తి అవుతుంది. ఈ క్రమంలో రేపు ఉదయం పది గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ పొడిగించడం ఖాయంగా ఉండడంతో అది ఎలా చేస్తారు అని అందరిలోనూ ఆసక్తి ఉంది.

తదుపరి దశలో రెడ్, ఆరంజ్ మరియు గ్రీన్ యొక్క జోనల్ వ్యవస్థ అమలు చేయబడుతుందని వార్తలు వస్తున్నాయి. రెడ్, ఆరంజ్ మరియు గ్రీన్ జోన్లను వ్యాప్తి యొక్క తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్రాంతాలను వర్గీకరిస్తాయి. 15 కంటే ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను రెడ్, 15 కంటే తక్కువ ఉంటే ఆరంజ్, మరియు కేసులు లేని చోట్ల గ్రీన్ గా వర్గీకరించవచ్చని అంటున్నారు.

నగరాలతో పోల్చితే ఈ గ్రీన్ జోన్లు చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పట్టణ మరియు పారిశ్రామిక ప్రాంతాల్లోని గ్రీన్ జోన్లలో కఠినమైన సామాజిక దూరం మరియు ఆరోగ్య నిబంధనలతో, సాధ్యమైనంతవరకు ఆర్ధిక కార్యకలాపాలను పునః ప్రారంభించడానికి కేంద్రం మళ్లీ ఆసక్తి చూపుతోందట.

అయితే ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఏదైనా తేడా వస్తే అమెరికా వంటి పరిస్థితి ఎదురుకోవాల్సి వస్తుంది. అయితే లాక్ డౌన్ వల్ల కలుగుతున్న తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఒక వైపు… పెరుగుతూ పోతున్న కేసుల మధ్య కేంద్రం కూడా డోలాయమానంలో పడింది. జోనల్ వ్యవస్థ వైపు మొగ్గు చూపితే పెద్ద రిస్క్ తీసుకున్నట్టే. ఇది ఇలా ఉండగా…. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా 9,152 కేసులు ఉన్నాయి.