Narendra Modi Targets Goldపెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రజానీకం అంతా, ఇక నుండి మోడీ అంటే మండిపడడం ఖాయంగా కనపడుతోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన గోల్డ్ పై కేంద్రం నిర్ణయం వచ్చేసింది. బంగారంపై వచ్చే వార్తలన్నీ ఒట్టి పుకార్లే, ఎవరూ ఇలాంటి వదంతులను నమ్మవద్దు అంటూ ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలన్నీ అవాస్తవాలేనని తేటతెల్లమయ్యింది.

నల్లధనానికి మరో రూపుగా భావించే బంగారంపై కఠినతరమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది కేంద్రం. ఇప్పటివరకు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందనే దానిని ప్రకటించడమే కాకుండా, బంగారం ఎక్కడ నుండి వచ్చింది? అంటే వారసత్వంగా సంక్రమించిందా? ఎప్పుడు కొనుగోలు చేసారు? కొనుగోలు చేస్తే బిల్లు ఉందా? బిల్లు ఉంటే ఆ ఏడాదిలో ఆదాయం ఉందా? ఆదాయం ఉంటే ఇన్ కం టాక్స్ చెల్లించారా? చెల్లించకపోతే ప్రస్తుతం పెనాల్టీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది?

ఒకవేళ బిల్లులు లేవంటారా? అయితే ఆ బంగారం అంతా ఈ ఏడాదిలోనే కొనుగోలు చేసారని భావించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆదాయపు లెక్కల వివరాలు తెలపాల్సి ఉంటుంది. అలా చేయలేని పక్షంలో మళ్ళీ ఐటీ పెనాల్టీతో కలిపి సామాన్యుడి నెత్తిపైన ఓ గుదిబండ మోపడం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు మీడియా వర్గాలలో ప్రధానంగా ప్రసారం కావడంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా మహిళలైతే మోడీ అంటేనే మండిపడుతున్నారు. ఎప్పుడెప్పుడో కొనుగోలు చేసిన బంగారానికి ఇప్పుడు లెక్కలు చెప్పమంటే ఎలా? ఎప్పుడో కొనుగోలు చేసిన బిల్లులను ఇప్పటివరకు దాచి ఉంచడం సాధ్యమయ్యే విషయమేనా? అయినా తమ భర్తలు సంపాదించిన వైట్ మనీలోనే కొంత మొత్తాన్ని తమకు ఇస్తుంటే… వాటిని దాచుకుని పిల్లల కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే… దానిని బ్లాక్ మనీ అంటే ఎలా? అన్న అనేక ప్రశ్నలు మోడీని సూటిగా ప్రశ్నిస్తూ వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఏం జరుగుతుందో గానీ, మోడీ పేరు మాత్రం అందరి నోట మారుమ్రోగుతోంది. అది పాజిటివ్ గా అయినా… నెగటివ్ గా అయినా..!