Narendra Modi - Sonia Gansdhiవచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లోక్ సభకు జరగబోయే 25 నియోజక వర్గాలలో ఎవరు గెలుస్తారనే దానిపై ఓ జాతీయ మీడియా సంస్థ సర్వే నిర్వహించి ప్రసారం చేసిన కధనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 25 ఎంపీ స్థానాలకు గానూ భారతీయ జనతా పార్టీ 7 స్థానాలను కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ కు 3 దక్కుతాయని రెండు జాతీయ పార్టీలకు పంచగా, మిగిలిన 15 చోట్ల ఇతరులు గెలుస్తారని తెలిపింది.

బహుశా ఈ సర్వేను ప్రధాని నరేంద్ర మోడీ గానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గానీ వీక్షించినట్లయితే, వారు కూడా షాక్ కు గురికాక తప్పదు అనే విధంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ ను ఏపీ జనాలు ప్రజలు గల్లంతు చేయగా, మరో పదేళ్ళకు కూడా పార్టీ స్థాపించుకోవడానికి అడ్రస్ దొరుకుతుందో లేదో అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్తితి ఉంది. ఇక ప్రస్తుత బిజెపి పరిస్థితి కూడా అందుకేం విరుద్ధం కాదు.

గత ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవడం వలన 2 ఎంపీ సీట్లు లభించగా, అది ఇప్పుడు 7కు చేరుతుందని చెప్పిన ఈ సర్వే నవ్వులపాలవుతోంది. కాంగ్రెస్ కు 2014లో రుచిచూపించిన తెలుగు ప్రజలు, బిజెపికి 2019లో అదే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న వేళ ఈ సర్వే అత్యంత హాస్యాస్పదంగా మారింది. దీంతో ప్రాంతీయ రాజకీయ సమాచారాలపై జాతీయ మీడియాకు ఎంత పట్టు ఉందన్న విషయం బహిర్గతమైంది.