Narendra-Modi-Makes-A-Comment-Which-Does-Not-Suit-the-Dignity-of--PMPఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడో పూర్తి అయిపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ స్థాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్క చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రైన చంద్రబాబుపై స్పందించడం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు, ఆయన రాజకీయ పర్యటనలపై కూడా ఆయన నోరు మెదిపారు. తొలి మూడు దశల పోలింగ్ సమయంలో తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఇప్పుడు గాలి ఎటు వీస్తుందో తెలిసి ఈవీఎంలపై నిందలేస్తున్నారని మోదీ విమర్శించారు.

క్రికెట్‌లో కొన్నిసార్లు ఔటయిన బ్యాట్స్‌మెన్ అంపైర్‌ను తప్పుబట్టినట్టు, ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతున్నారని మోదీ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. నిజమే క్రికెట్ లో బ్యాట్సమెన్ అవుట్ అయితే అంపైర్‌ను నిందించడం సరికాదు. అయితే తప్పుడు నిర్ణయాలు ఇచ్చే అంపైర్లను కూడా మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏదైనా కానీ అప్పట్లో సచిన్ టెండూల్కర్ క్రీజ్ లో ఉంటే పనిగట్టుకుని తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన స్టీవ్ బక్నర్ లాంటి అంపైర్‌ను కూడా చూశాం.

కాబట్టి అంపైర్లు అన్నివేళల నిష్పక్షపాతంగా ఉంటారని లేదు… ఉండాలని లేదు. మోడీ రాజకీయ ప్రకటనల కోసం ఎన్నికల షెడ్యూల్ ను వాయిదా వెయ్యడం… సైన్యాన్ని ఉపయోగించుకుని ఓట్లు అడుగుతున్నా ఆపలేకపోయిన ఎన్నికల సంఘాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కావాలని చంద్రబాబును ఇరుకున పెట్టెల ఈసీ వ్యవహరించడం కూడా బహిరంగ రహస్యమే కదా? ఇప్పుడు అంపైర్‌ వంటి ఈవీఎంలను అనుమానించినా, ఎన్నికల సంఘాన్ని అనుమానించినా అది మీ పుణ్యమే మోడీ గారూ