Narendra Modi  Master Plan to combat with no confidence motionఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తెలుగుదేశం, వైకాపాలు అవిశ్వాసతీర్మానాలు చర్చకు రాకుండా పావులు కదుపుతుంది మోడీ ప్రభుత్వం. సోమవారం సభ ప్రారంభం అవ్వగానే ఏఐఏడీఎంకె సభ్యులు సభామధ్యంలో నిలబడి ఆందోళన చేయొచ్చని, దాని ఆధారంగా స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాలను తిరస్కరిస్తూ ఒకేసారి సభను నిరవధిక వాయిదా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

స్వర్గీయ జయలలిత తరువాత ఏఐఏడీఎంకె పార్టీ పూర్తిగా మోడీ గ్రిప్ లోకి వచ్చిందని తెలిసిందే. వైకాపా, తెరాస, ఏఐఏడీఎంకె, తృణమూల్‌కాంగ్రెస్‌లు నిరవధికంగా సభా మధ్యమంలోకి వచ్చి ఆందోళన చేయడంతో ప్రభుత్వం చర్చ లేకుండానే 99 పద్దులను ఆమోదించేసింది.

ఆర్థిక, ద్రవ్య వినిమయ బిల్లులు, గ్రాట్యుటీ పెంపు తదితరాలనూ అదే విధంగా గట్టెక్కించారు. బడ్జెట్‌పరమైన వ్యవహారాలన్నీ ముగిసిపోవడంతో ఇంకా సభ నిర్వర్థికంగా వాయిదా వేసేస్తే అవిశ్వాసం తప్పించుకోవచ్చని ప్రభుత్వం ప్లాన్ గా కనిపిస్తుంది. వాస్తవానికి బడ్జెట్‌ మలి విడత సమావేశాలు ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కొనసాగాలి. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఆ అవకాశం లేదు.