Narendra Modi loosing confidence on Daggubati -Purandeshwariఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు. బీజేపీలో మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉంటూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఇటీవలే ఆవిడ పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆవిడ కుమారుడు చెంచు రామ్ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఆవిడ భర్త మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపాలో క్రియాశీలకంగా ఉంటున్నారు. టీడీపీ నుండి నాయకులను తెచ్చి పార్టీలో చేర్పిస్తున్నారు.

తాను మాత్రం బీజేపీలోనే కొనసాగానున్నట్టు పురంధేశ్వరి చెప్పారు. మొన్న ప్రధాని అమరావతి వచ్చినప్పుడు ఆయన ఆవిడను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. నిన్న విశాఖలో ఆవిడకు ప్రధాని ప్రసంగాన్ని అనువాదం చేసే అవకాశాన్ని ఇచ్చారు. సొంత వాళ్ళే వేరే పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీలో ఇంతటి ప్రాముఖ్యత ఇవ్వడమే అరుదే. అయితే మోడీ పురంధేశ్వరి మీద నమ్మకం ఉంచారు. కాకపోతే ఆవిడ దానిని వమ్ము చేశారు. విశాఖలో పురంధేశ్వరి అనువాదం చాలా చప్పగా సాగింది.

ప్రధాని స్పీచ్ లో చాలా భాగాలు ఆవిడ స్కిప్ చేశారు. చంద్రబాబు మీద లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలను ఆమె మొత్తానికి వదిలేశారు. దీనితో ఆవిడను బీజేపీ అభిమానులే అనుమానించడం మొదలు పెట్టారు. చిన్నమ్మకు మరిది మీద, మేనల్లుడి మీద మమకారం గుర్తోచినట్టుంది అంటూ సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు. మరొకసారి ఆమెకు ప్రధాని స్పీచ్ ను అనువాదం చేసే అవకాశం ఇవ్వకూడదని బీజేపీ అగ్రనేతలకు ట్వీట్లు చేస్తున్నారు. పార్టీలో ఆవిడ ప్రాముఖ్యత తగ్గించాలని సూచిస్తున్నారు.