KCR-Government-Taking-People-For-Grantedఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన 15వ ఆర్ధిక సంఘం గైడ్ లైన్స్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేవిలా ఉన్నాయి అని కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ ఆర్ధికమంత్రి హాజరు కాలేదు. ఇటువంటి సమావేశాలు దేశసమగ్రతకు విఘాతం కలిగిస్తాయని అందుకే తాము పాల్గొనమని కేసీఆర్ ప్రకటించారు.

అయితే తెర మాటున జరిగింది వేరు. ఆ సమావేశానికి తెలంగాణ నుంచి కూడా హాజరు అవుతారని అనుకున్నారు. కాని ఆకస్మకింగా ఆ సమావేశానికి వళ్లరాదని నిర్ణయించారట. దానికి కారణం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతు పెట్టుబడి సాయం చెక్కులకు గాను నగదు అందుబాటులో ఉంచడానికి గాను కేంద్రం ఈ షరతు పెట్టిందట.

దాంతో ఈటెల ఆ సమావేశానికి వెళ్లలేదు. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్ తెలంగాణ బ్యాంకులకు రెండువేల కోట్ల రూపాయల నగదును మంజూరు చేసిందట. మొత్తానికి తెలంగాణ తెలివిగా అలోచించి మోడీ తో క్విడ్ ప్రో కో డీల్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల తరువాతి సమావేశం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది.