NArendra Modi Highlighted towards Hindutvaఅయోధ్యలో భవ్యమైన రామాలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. అయోధ్య సమస్యను సుప్రింకోర్టు పరిష్కారం చేసిన తర్వాత ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరిగిన సంగతి తెలిసిందే. నలభై కేజీల వెండి ఇటుకను మొదటిగా వేసి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

అయితే కరోనా పేరిట బీజేపీ కురువృద్దులు… రామ మందిర నిర్మాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎల్ కే అద్వానీ, మురళి మనోహర్ జోషిలను ఈ కార్యక్రమంలో పక్కన పెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజయంగా చూపించుకుని, ఆయనను హిందూ హృదయ సామ్రాట్ గా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా వారిని పక్కన పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

ఏది ఏమైనా ఎన్నో దశాబ్దాలుగా హిందువుల తీరని కల చివరికి మోడీ హయాంలోనే నెరవేరడంతో సహజంగా క్రెడిట్ వస్తుంది. అలాగే మరింత క్రెడిట్ కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చెయ్యడం వింతేమీ కాదు. ఇది ఇలా ఉండగా…. భవ్యా మందిర నిర్మాణం మూడున్నర సంవత్సరాలలో పూర్తవుతుందని భావిస్తున్నారు.

అయితే కరోనా మహమ్మారి మరో 6-8 నెలల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాణ కంపెనీ, ఎల్ అండ్ టి ఆలయ నిర్మాణాన్ని అమలు చెయ్యబోతుంది. వచ్చే ఎన్నికలలోగా నిర్మాణం పూర్తి చేసి మోడీ దానిని ప్రారంభించే అవకాశం ఉంది.