Narendra Modi - KCRఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో సభ జరగకుండా చూసి ఆంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానాలు చర్చకు రాకుండా తమ ఎంపీల ద్వారా చేసినందుకు గాను తెరాస ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం నజరానా ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది.

తొలి విడతలో భాగంగా ఎకరాకు రూ.4వేలు చొప్పున రైతులకు చెక్కులు కూడా అందించింది. అయితే ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులను బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసింది మోడీ ప్రభుత్వం. ఇందుకోసం తెలంగాణలోని బ్యాంకులకు రూ.5,400కోట్లు సరఫరా రిజర్వు బ్యాంకు ద్వారా పంపింది.

రైతుబంధు పథకం కోసం ఎస్‌బీఐ నేతృత్వంలోని మొత్తం 8 బ్యాంకులు 59లక్షల చెక్కులను ముద్రించాయి. ఈ చెక్కులను ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ పధకానికి ఇబ్బంది రాకుండానే తెరాస అప్పట్లో బీజేపీకి సహాయ పడింది అనే వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే మోడీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.