Narendra -Modi - COVID 19 Vaccineకరోనా సెకండ్ వేవ్ మోడీ ప్రభుత్వం ఇమేజ్ ని పెద్ద ఎత్తున డామేజ్ చేసింది. సెకండ్ వేవ్ పరిస్థితులను ఎదురుకోవడంలో కనీస సన్నద్ధత లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో మొట్టమొదటి సారిగా ఏడేళ్లలో మునుపెన్నడూ లేని ప్రజావ్యతిరేకత నరేంద్ర మోడీ ఎదురుకున్నారు.

కరోనా వ్యాక్సిన్ వచ్చిన తొలినాళ్ళలో వ్యాక్సిన్ క్రెడిట్ తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇచ్చే సర్టిఫికెట్ల మీద మోడీ బొమ్మ వేశారు. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్లకు అలాగే 45 ఏళ్ల పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచ్చితంగా వ్యాక్సిన్ వేస్తుండడంతో దాని మీద పెద్దగా విమర్శలు రాలేదు.

అయితే ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలయ్యింది. పైగా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ నుండి వేయించుకునేంత వరకు ఉంటున్న ఇబ్బందుల కారణంగా ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు. పై పెచ్చు వ్యాక్సిన్ ఒక్క డోసు కోసం 18-44 ఏళ్ళ మధ్య వయసు వారు అటుఇటుగా పదిహేను వందలు ఖర్చుపెడుతున్నారు.

దానితో తాము అంత డబ్బులు ఖర్చుపెట్టి వ్యాక్సిన్ వేయించుకుంటే దాని మీద మోడీ బొమ్మ ఏంటి అని విమర్శలు వస్తున్నాయి. అటువంటి వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. కోవిడ్ మరణాల డెత్ సర్టిఫికెట్ల మీదకూడా మోడీ బొమ్మ వెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొందరు కోర్టుకు వెళ్లే ప్రయత్నాలలో కూడా ఉన్నారు.