narendra-modi-cheating-to-andhra-pradeshదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తోన్న ద్రోహాన్ని అధికార తెలుగుదేశం పార్టీ తప్ప, మిగిలిన ఎవరూ నిలదీయడం లేదన్న విషయం తెలిసిందే, మిగిలిన వారు ఎందుకు విమర్శించడం లేదో అన్న కారణాలు కూడా బహిరంగమే. బిజెపికి కొమ్ముకాస్తూ వైసీపీ అండ్ జనసేన వ్యవహరిస్తోన్న విధానాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తుండడంతో… ఇకపై కూడా ఈ రెండు పార్టీలు బిజెపిని గానీ, ప్రధాని నరేంద్ర మోడీని గానీ విమర్శించే అవకాశాలు లేవని కూడా తేలిపోయింది. దీంతో రాజకీయంగా తాము చేస్తోన్న పోరాటానికి మీడియా కంటెంట్ ను కూడా జోడిస్తున్నట్లుగా కనపడుతోంది.

తాజాగా గురువారం నాడు మహా టీవీ ప్రసారం చేసిన కధనమే ఇందుకు నిదర్శనం. మోడీ వక్రబుద్ధిని చూపిస్తూ… ఏపీకి చేసిన ద్రోహాన్ని స్పష్టంగా చెప్పిన వైనం ఈ కధనంలో స్పష్టమైంది. ఒక రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఎందుకు? అంటూ నిలదీస్తోన్న బిజెపి నేతలకు (పరోక్షంగా జనసేన అండ్ కో)కు కూడా కళ్ళు తెరిపించేలా గుజరాత్ లోని దోలేరా సిటీకి రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఎలా సేకరించారు? దీనిపై మీ సమాధానం ఏంటి? అంటూ మహా టీవీ రిపోర్టర్ బిజెపి నేతలను నిలదీశారు. మరో ఢిల్లీని ఏపీకి ఇస్తానని చెప్పిన మోడీ, రాష్ట్రానికి చేసిందేంటి? అంటూ సాగిన ఈ కధనానికి తెలుగు ప్రేక్షకులలో మంచి స్పందన వచ్చింది.

మహా టీవీ తెలుగుదేశం పార్టీకి సహకారం అందిస్తుందన్న విషయం బహిరంగమే గానీ,` టిడిపికి అనుకూలంగా చేసే ప్రసారాల కంటే కూడా ఇలా ప్రజలను మేలుకోల్పే ప్రసారాలకు విలువ ఉంటుంది, అలాగే దేశంలో జరుగుతున్న పరిస్థితిని, బిజెపి చేస్తోన్న ద్రోహాన్ని ప్రజలకు చేరువ చేసేలా ఉంటుంది. అధికార తెలుగుదేశం పార్టీ సమాచారం లేకుండా ఇలాంటి కధనాలు ప్రసారం కావన్న సంగతి అందరూ ఒప్పుకునే విషయమే గానీ, ప్రజలకు ఉపయోగకారిగా మారే ఎలాంటివైనా ప్రసారంలో చేయడంలో తప్పులేదు. అది రాష్ట్ర ప్రభుత్వ తప్పులు ఉన్నా… కేంద్ర ప్రభుత్వం పొరపాట్లైనా… వైసీపీ – బిజెపి – జనసేనల లాలూచీ అయినా…!