Narendra-Modi-Chandrababu-Naidu-New-Delhi-Tourసిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు జీర్ణించుకోలేని ఓ వార్త ఇది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. ఢిల్లీలో జరుగబోయే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనవలసిందిగా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక విభాగంలో ఈ సమావేశం జరుగనుంది. 2023, ఆగస్ట్ 15 వరకు దేశవ్యాప్తంగా జరుగబోయే ఈ ఉత్సవాల నిర్వహణ కొరకు జరిగే ఈ సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో ఎన్నికలు పొత్తులు పెట్టుకోవాలని భావిస్తే, ముఖ్యమంత్రితో సహా వైసీపీ నేతలందరూ అదేదో నేరమన్నట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ము విజయవాడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిస్తే సాక్షి మీడియాలో కట్టుకధలు అల్లి ముద్రించుకొని సంతృప్తి పడ్డారు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగబోయే సమావేశానికే రమ్మనమని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినందున బిజెపి, టిడిపి దగ్గరవుతున్నాయని ఆరోపించలేరు. కనుక చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంపై వైసీపీ నేతలు అసిడిటీ సమస్య ఏవిదంగా బయటపడుతుందో చూడాలి. ఒకవేళ వారు భయపడుతున్నట్లే బిజెపి అధిష్టానం మళ్ళీ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపేందుకు సిద్దపడితే ఇక సిఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకు నిద్రలేని రాత్రులు తప్పవు.