Narendra Modi Has No Time for Telangana BJP Leadersఅవినీతిపై బ్లాక్ మనీపై యుద్ధం చేస్తున్నాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రగల్భాలు పలకడం మనం చూస్తుంటే ఉన్నాం. అయితే నోట్ల రద్దు తరువాత పేదలు ఇబ్బంది పడ్డారు తప్ప పెద్దగా ఒరిగిందేమి లేదు. ఇప్పుడు నెమ్మదిగా పట్టు సడలిస్తుంది కేంద్రం. ఇటీవలే తీసుకున్న రెండు నిర్ణయాలే దీనికి నిదర్శనం.

50000పైగా కొనుగోలు చేసే బంగారంపై పాన్ కార్డు ఇవ్వనవసరంలేదని గవర్నమెంట్ ప్రకటించింది. అదే విధంగా ఆస్తి లావాదేవీలకు సంబంధించి ఆధార్‌ను తప్పనిసరి చేసే అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది.

బినామీ ఆస్తుల భరతం పట్టడానికి చర్యలు చేపడతామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఆస్తి లావాదేవీలకు ఆధార్‌ను కేంద్రం తప్పనిసరి చేస్తుందన్న వూహాగానాలు వూపందుకున్నాయి. అత్యధిక నల్లధనం ఉండేది స్థిరాస్తి, బంగారం రూపంలోనే. నోట్ల రద్దు తరువాత వీటి మీద పెట్టుబడులు మరింత ఎక్కువయ్యాయి. వీటిని వదిలేయడంతో అవినీతిపై యుద్ధం అంటూ మోడీ చెప్పే మాటలు నీటి మూటలేనా? అనిపించకమానదు.