Narendra Modi Appసోషల్ మీడియాలో తెలుగు యువత బీజేపీకి చెమటలు పట్టిస్తుంది. యువత బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలంటూ బీజీపీ పేస్‌బుక్‌ పేజీకీ తక్కువ రేటింగ్‌ ఇస్తున్నారు. దీంతో బీజేపీ పేజీలో రేటింగ్‌ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేశారు. ఇప్పుడు వారు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ యాప్ నే టార్గెట్ చేసారు

ప్లే స్టోర్ లోని నరేంద్ర మోడీ యాప్ మీద 1 రేటింగ్ ఇస్తున్నారు. ఉన్నఫళంగా తక్కువ రేటింగ్ రావడంతో యావరేజ్ రేటింగ్ తగ్గుతూ వస్తుంది. ఇప్పటిదాకా 12000 మంది 1 రేటింగ్ ఇచ్చారు. యాప్ కామెంట్స్ లో ఏపీకి జరిగిన అన్యాయం గురించి రాస్తున్నారు. కొందరైతే మేము మోడీ అభిమానులనే కానీ ఏపీకి అన్యాయం చెయ్యడం జీర్ణించుకోలేకపోతున్నాం అని కూడా అంటున్నారు.

చూడాలి ఈ దాడిని ఎలా ఎదురుకుంటారో. ఈ వార్తలు సోషల్ మీడియా, నేషనల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో ఆ పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే బీజేపీకి రానున్న రోజులలో గడ్డు పరిస్థితి ఎదురు కాబోతుంది సోషల్ మీడియాలో.