Survey reports Andhra pradesh people against Narendra Modiఈ తెలుగు సామెతను దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించినంత సీరియస్ గా మరొకరు అనుసరించడం లేదనే చెప్పాలి. ఆర్ధికంగా ధీనావస్థలో కొట్టుమిట్టాడుతోన్న ఆంధ్రప్రదేశ్ కు వస్తూ ‘మట్టి, నీరు’ తీసుకువచ్చి, ఏపీ ప్రజల నోట్లో మట్టి కొట్టిన మోడీ, ఇతర దేశాలకు మాత్రం వారికి అవసరమైన సాయాన్ని అందిస్తుండడం శోచనీయం.

ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం దేశానికి మంచే. అలా చేయాలి కూడా! కానీ దేశంలో భాగస్వామ్యం అయిన రాష్ట్రాలకు మొండిచేయి చూపిస్తూ ఇతర దేశాలకు సాయపడితే, దేశం అభివృద్ధి పధంలో పయనిస్తుందా? రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాలను చిన్న చూపు చూస్తే కేంద్రానికి గొప్ప కీర్తి ప్రతిష్టతలు వస్తాయా? మోడీ గారి దృష్టిలో అయితే అవుననే సమాధానం లభిస్తుందేమో!?

మంగళవారం నాడు రువాండాలో పర్యటించనున్న మోడీ, ఆ దేశ అధ్యక్షుడు కగామెకు 200 ఆవులను బహుమతిగా ఇవ్వనున్నారు. పేదల ఆర్ధిక స్థితిని మెరుగు పరిచేందుకు ‘గిరింకా’ అనే కార్యక్రమం ద్వారా ఆ దేశ ప్రభుత్వం ఒక్కో ఆవును ఇస్తుండగా, అందులో భాగంగా ఇండియా తరపున 200 ఆవులను బహుమతిగా ఇవ్వనున్నారు మోడీ.

ఆపదలో ఉన్న ఇతర దేశాలకు చేయాల్సినంత సాయం చేయడంలో తప్పు లేదు. కానీ సొంత ఇంటి వారిని కూడా పట్టించుకోవాలి కదా! స్థానికంగా వచ్చేపాటికి రాజకీయాలు ప్రస్తావిస్తూ మ్యాటర్ ను డైవర్ట్ చేయడం, ఇతర పార్టీలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటూ, అధికార ప్రభుత్వాలను నీరుగార్చడం మోడీ మార్క్ రాజకీయం. ఎనీ డౌట్స్!?