Amit Shah - Narendra Modiవైఎస్సార్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ తరపున షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పది రోజులుగా పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా రఘురామ రాజు చేస్తున్న వ్యాఖ్యలను షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

అలాగే పార్టీ ఎమ్మెల్యేలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేయడం, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై పార్టీ అధినాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ షోకాజ్ నోటీసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

అయితే ఈ పరిణామంతో రఘురామ కృష్ణంరాజు రొట్టె విరిగి నేతిలో పడినట్టే అని కొందరు అంటున్నారు. పార్టీ సస్పెండ్ చేసిన వెంటనే… ఆయన డైరెక్టుగా బీజేపీ ఆఫీసుకు వెళ్ళి ఆ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. కొందరు ఏకంగా జగన్ ని దెబ్బతియ్యడానికి ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని గట్టిగా చెబుతున్నారు.

అటువంటి పని చేసే అవకాశం తక్కువే. ఒకవేళ చేస్తే మాత్రం అది వైఎస్సార్ కాంగ్రెస్ కు గట్టి షాక్ అనే చెప్పుకోవచ్చు. అలాగే నరేంద్ర మోడీ… అమిత్ షాల నెక్స్ట్ టార్గెట్ జగన్ అని అనుకోవచ్చు. అంతవరకూ వస్తే ఈ షోకాజ్ నోటీసు ఇచ్చినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ చింతించాల్సి రావొచ్చు.