Narendra Modi - Amit Shah -Jaganప్రస్తుత గవర్నమెంట్ లో బీజేపీ కి సొంతంగా మెజారిటీ ఉంది. ఇందిరా గాంధీ మృతి తరువాత జరిగిన ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కు సొంతంగా మెజారిటీ వచ్చింది. మళ్ళి ఇన్ని సంవత్సరాల తరువాత ఒక పార్టీకి సొంతంగా మెజారిటీ ఇచ్చింది దేశం. అయితే గెలుపు మోడీ అమిత్ షాలకు తలకు ఎక్కింది.

ఆ పార్టీకి ఉన్న నమ్మదగిన మిత్రులను ఒకరితరువాత ఒకరిని దూరం చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని వీడి వైకాపాను అక్కున చేర్చుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనను కూడా దూరం చేసుకుంది. 29 ఏళ్ల దోస్తీ తరువాత 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చెయ్యబోతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.

అవినీతి మకిలి వొళ్ళంతా పూసుకున్న శరద్ పవార్ ఎన్సీపీ వైపు చూస్తుంది బీజేపీ. ఒకపక్క అవినీతి పై యుద్ధం అంటూ అవినీతి మకిలి అంటుకున్న పార్టీలతో దోస్తీ కట్టి దానిని ఎలా సమర్ధించుకోనుందో మరి? తప్పుజారి వచ్చే ఎన్నికలలో బీజేపీకు సొంతంగా మెజారిటీ రాకపోతే అప్పుడు నమ్మకమైన మిత్రుల విలువ తెలుస్తుంది కమలనాధులకు!