narendra-modi-ys-jaganప్రాంతీయ పార్టీల మనుగడపై బీజేపీ నాయకత్వానికి స్పష్టమైన అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ తో “ప్రాంతీయ పార్టీలకి కాలం చెల్లింది. మీరు మాతో కలిసిపొండి.” అని అమిత్ షా చెప్పిన మాటలతోనే తెలుస్తుంది వాళ్ళ ఆలోచనా ధోరణి ఏంటో. అయితే ఇప్పటికిప్పుడు ఏపీలో బీజేపీ బలపడే అవకాశం లేదు.

ఓటుకు నోటుతో చంద్రబాబును అదుపు చెయ్యొచ్చు అని తొలుత ప్రయత్నించినా అది కోర్టులో నిలబడదు అని తేలిపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఏపీకి నిధులు ఇవ్వకుండా ప్రజల దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీబీఎన్ ను దోషిగా నిలబెట్టేలా ప్రయత్నం చేస్తున్నారు కమలనాధులు.

ఆంధ్రలో అభివృద్ధిని ఆలస్యం చెయ్యగలిగితే తెదేపా స్థానాన్ని తాము ఆక్రమించొచ్చు అని భాజపా భావిస్తుంది. మరోవైపు జగన్ తో ఈ సమస్య ఉండదు. తగ్గి ఉండకపోతే లోపల ఉంటావ్ అని బెదిరించి దారిలోకి తెచుకోవచ్చు. ఈ విషయం తెలుసు కాబట్టే 2014 ఎన్నికలకి ముందు ఇప్పుడే కాదు ఎప్పుడూ బీజేపీతో కలవం అని చెప్పిన జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండీ కమలనాధులను ప్రసన్నం చేసుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు.

బీజేపీ అడగకుండానే ప్రెసిడెంట్ ఎన్నికలలో మద్దత్తు ఇచ్చేసారు జగన్. విరోధం ఉన్న వెంకయ్య నాయుడుకు కూడా సపోర్ట్ చేసేసారు. అయితే ఉన్నఫళంగా జగన్ ను కేసులనుండి తప్పిస్తే ప్రజలు నమ్ముతారా అనేది పెద్ద ప్రశ్న? అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ తో స్నేహాన్ని ఎలా సమర్ధించుకుంటారో?