మోడీ గారు గుస్సా ఐతున్నారు గానీ అదే మీకు ప్లస్ అవుతుందిపార్లమెంట్ సమావేశాల మధ్యలో బీజేపీ ఎంపీలతో స‌మావేశం అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ టార్గెట్ గా ప్ర‌సంగించారు. వ‌రుస‌గా ఒక్కో రాష్ట్రంలో ఓడిపోతూ కాంగ్రెస్ క‌నుమ‌రుగ‌య్యే స్థితికి దిగ‌జారినా… త‌న తీరు మార్చుకోవ‌టం లేద‌ని ప్ర‌ధాని మోడీ మండిప‌డ్డారు.

త‌న‌కు అల‌వాటైన పాత రాజ‌కీయాలు చేస్తూ ప్ర‌భుత్వంపై అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేస్తుంద‌ని మండిప‌డ్డారు. దేశంలోని ప్రతిపక్ష నాయకులపై కొందరు ప్రముఖుల పై కేంద్ర ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతుందని వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్లమెంట్ ని స్తంబింపచేస్తుంది.

దానిపై అగ్గి మీద గుగ్గిలం అవుతూ… ప్ర‌జాస్వామ్యంలో కీల‌క‌మైన డిస్క‌స్ అండ్ డిబేట్ అన్న సూత్రాన్ని పాటించ‌టం లేద‌ని ప్ర‌ధాని బీజేపీ ఎంపీల‌తో వ్యాఖ్యానించారు. నిజమే మరి… వ‌రుస‌గా ఒక్కో రాష్ట్రంలో ఓడిపోతూ కాంగ్రెస్ క‌నుమ‌రుగ‌య్యే స్థితికి దిగ‌జారినా… త‌న తీరు మార్చుకోవ‌టం లేదు.

లేకపోతే కరోనా సెకండ్ వేవ్ సమయంలో మనుషులు ఆక్సిజన్ లేకుండా చనిపోతుంటే ప్రభుత్వాన్ని కనీసం ఇరుకున పెట్టలేకపోయింది కాంగ్రెస్. కరోనా సమయంలో ప్రజలు ఆదాయమార్గాలు లేక ఇబ్బందులు పడుతుంటే… కాపాడాల్సిన ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి ఖజానా నింపుకుంటుంటే కాంగ్రెస్ ఏమీ చెయ్యలేకపోయింది.

కాంగ్రెస్ తీరు మారలేదు అంటూ మోడీ గారు గుస్సా ఐతున్నారు గానీ అదే మీకు (బీజేపీకి) ప్లస్ అవుతుంది.