Nara Lokesh Yuvagalam Padayatra Scheduleటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ వేలాదిమంది పార్టీ కార్యకర్తలు వెంటరాగా శుక్రవారం ఉదయం 11.03 గంటలకి కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. మరికొద్ది సేపటిలో కుప్పంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారు.

ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పాదయాత్ర చేసి క్యాంప్ సైట్ వద్ద తన కార్వాన్‌లో రాత్రి విశ్రాంతి తీసుకొంటారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలలో దాడులు జరిగిన అనుభవాలని దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్‌ రక్షణ కోసం టిడిపి కార్యకర్తలతో పాటు బౌన్సర్లని కూడా ఏర్పాటు చేసింది. రాత్రి ఆయన కార్వాన్ చుట్టూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. పాదయాత్రలో ఎవరికైనా అత్యవసర చికిత్స అందించేందుకు అంబులెన్స్, ఎప్పుడు ఫోన్‌ చేస్తే అప్పుడు వచ్చివాలిపోయే హెలికాఫ్టర్‌ సర్వీసులని కూడా టిడిపి సిద్దం చేసి ఉంచింది. ఓ ప్రతిపక్ష నాయకుడు రక్షణ కోసం ఇన్ని ఏర్పాట్లు చేసుకోవలసి రావడం ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి కూడా అవమానమే కదా? కానీ తప్పడం లేదు.

శనివారం (2వ రోజు) పాదయాత్ర రూట్ మ్యాప్, షెడ్యూల్:

ఉ.8.00 గంటలకి: కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వద్ద క్యాంప్ సైట్ నుంచి 2వరోజు పాదయాత్ర ప్రారంభం

ఉ.9.15 గంటలకి: బెగ్గిలపల్లిలో స్థానికులతో ముఖాముఖీ

ఉ.11.05 గంటలకి: కడపల్లిలో పార్టీ పెద్దలతో మాటామంతీ, ఆశీర్వచనం

మ.1.30 గంటలకి: కలమలదొడ్డిలో భోజన విరామం, సీనియర్ నేతలతో సమావేశం

మ.3.30 గంటలకి: కలమలదొడ్డి నుంచి మళ్ళీ పాదయాత్ర కొనసాగింపు

సా.5.00 గంటలకి: శాంతిపురం క్యాంప్ సైట్‌కు చేరిక, స్థానిక ప్రముఖులతో ముఖాముఖీ

సా.6.45 గంటలకి: 2వరోజు పాదయాత్రకు విరామం, శాంతిపురంలో రాత్రి బస

ఆదివారం (3వ రోజు)

ఉ.8.00 గంటలకి: శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు పాదయాత్ర ప్రారంభం

ఉ.8.45 గంటలకి: దారిలో స్థానిక ప్రముఖులతో సమావేశం

ఉ.9.45 గంటలకి: బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం

మ.12.15 గంటలకి: కె.గెట్టపల్లి జంక్షన్‌లో స్థానికులతో మాటమంతీ

మ.12.45 గంటలకి: కె.గెట్టపల్లిలో భోజన విరామం

మ.3.00 గంటలకి: కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు

సా.5.00 గంటలకి: చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌కు చేరిక, స్థానిక ప్రముఖులతో సమావేశం

సా.5.55 గంటలకి: చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌లో 3వరోజు పాదయాత్రకు విరామం, రాత్రి అక్కడే బస.