Nara_Lokesh_Yuva_Galam_Padayatra_Thamballapalle_Constituencyటిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో బుదవారం 43వ రోజు యువగళం పాదయాత్ర చేశారు. బుచ్చిరెడ్డిగారి పల్లెలో రైతులతో సమావేశమైనప్పుడు, జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పేరిట ఏవిదంగా రైతులను మోసం చేయబోతోందో వివరించారు.

“మన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సీబీఐ చుట్టూ తిరగడానికే సమయం సరిపోవడం లేదు. ఇక వ్యవసాయం, రైతుల సమస్యల గురించి ఏం పట్టించుకొంటారు?వాటిని పరిష్కరించే తీరిక ఏది?అందుకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటువంటప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు సాయపడకపోగా వారికి మరో ఉరితాడు సిద్దం చేస్తున్నారు. అదే… మోటర్లకు మీటర్లు బిగించడం. మీటర్లు బిగించినా మీరు ఎంత కరెంట్ కావాలంటే అంతా వాడుకోండి. దానికి ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని చెపుతున్నారు. కానీ గ్యాస్ సిలెండర్ సబ్సీడీల మెల్లమెల్లగా ఉచిత విద్యుత్‌ బిల్లులలో కూడా జగన్ ప్రభుత్వం కోత విధిస్తుంది.

ఒకప్పుడు గ్యాస్ సిలెండర్ మీద ప్రజలకు బాగానే సబ్సిడీ వచ్చేది కానీ క్రమక్రమంగా దానిలో కోత విధిస్తూ ఇప్పుడు ఓ రూ.11 చేతిలో పెడుతున్నారు. ఇదేవిదంగా జగన్ ప్రభుత్వం రేపు ఏవో కుంటి సాకులు చెప్పి మీ వ్యవసాయ మోటర్ల కరెంటు బిల్లులలో కూడా కోతలు విధిస్తుంది.

వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించేందుకు మీ అనుమతి కావాలంటూ జగన్ ప్రభుత్వం రైతుల చేత పత్రాల మీద సంతకాలు పెట్టించుకోవడం వెనుక కూడా పెద్ద కుట్ర ఉంది. జగన్ ప్రభుత్వం వాటిని చూపి మీకు తెలియకుండానే అప్పులు తీసుకొంటుంది. కనుక అధికారులు వచ్చి పత్రాలపై సంతకాలు పెట్టమని ఎంత ఒత్తిడి చేసినా ఎవరూ పెట్టవద్దు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెపుతూ వారి పేరుమీద కూడా అప్పులు చేయబోతున్న ఏకైక ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. అందుకే జగన్మోహన్ రెడ్డి కాదు అప్పుల మోహన్ రెడ్డి అని పేరు పెట్టాను,” అని నారా లోకేష్‌ అన్నారు.