Nara_Lokesh_YuvaGalam_TDPటిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ రెండు రోజులు విరామం తర్వాత నేడు మళ్ళీ తంబళ్ళపల్లె నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర (42వ రోజు) ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రెండు రోజులు నారా లోకేష్‌ పాదయాత్రను నిలిపివేయవలసి వచ్చింది. సోమవారం రాత్రి బెంగళూరు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నియోజకవర్గంలోని కురబలకోట మండలంలోని కంటేవారిపల్లెలో క్యాంప్ సైటుకి చేరుకొన్నారు.

రాత్రి అక్కడే బస చేసి ఈరోజు ఉదయం యధాప్రకారం ముందుగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో ‘సెల్ఫీ విత్ లోకేష్’ కార్యక్రమంలో సెల్ఫీలు దిగారు. తర్వాత కండ్లమడుగు, హార్స్ లీ హిల్స్ క్రాస్ రోడ్స్, మద్దయ్యగారి పల్లె, కుమ్మరపల్లి, నాయనిబావి మీదుగా పాదయాత్ర చేస్తారు.

దారిలో మద్దయ్యగారి పల్లె వద్ద బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో, ఆ తర్వాత స్థానిక మహిళలతో సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకొంటారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మళ్ళీ 2.50 గంటలకు కుమ్మరల్లిలో పాడి రైతులతో నారా లోకేష్‌ సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు గుట్టపాలెం క్యాంప్ సైటుకు చేరుకొంటారు. అక్కడ స్థానిక టిడిపి నేతలతో సమావేశమయ్యి రేపటి పాదయాత్రలో ప్రస్తావించాల్సిన విషయాల గురించి చర్చిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.