Nara_Lokesh_Yuva_Galam_Diary_టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 5వ రోజుకి చేరుకొంది. మంగళవారం ఉదయం పలమనేరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో ఉదయం 10.30 గంటలకి కస్తూరిపురం చేరుకొని నారా లోకేష్‌ గౌడ సంఘం పెద్దలని కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని వారి సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలని అడిగి తెలుసుకొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 11.40 గంటలకి కైగల్లు గ్రామంలో యాదవ సంఘంతో, మధ్యాహ్నం 12.30 గంటలకి దేవదొడ్డిలో కురుబా, కురుమ సంఘం పెద్దలతో సమావేశమవుతారు.

అక్కడే భోజన విరామం తర్వాత స్థానిక టిడిపి నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. మళ్ళీ పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 4.25 గంటలకి బైరెడ్డిపల్లి, రాయల్ మహల్లో బీసీ ప్రభావితులతో సమావేశమవుతారు. సాయంత్రం 5.15 గంటలకి బైరెడ్డిపల్లిలో టిడిపి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

మళ్ళీ అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ సాయంత్రం 6.55 గంటలకి కమ్మనపల్లె చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. అక్కడే స్థానిక టిడిపి నేతలతో రేపటి పాదయాత్ర గురించి చర్చిస్తారు.

నారా లోకేష్‌ పాదయాత్రకి సంబందించి ‘యువగళం-జనవాణి’ పేరుతో నారా లోకేష్‌ సంతకంతో ఉన్న ఓ డెయిరీని కూడా టిడిపి ఆన్‌లైన్‌లో ప్రచురిస్తోంది. జనవరి 30వ తేదీ యువగళం-జనవాణి డెయిరీ:
Yuva_Galam_Diary