Nara_Lokesh_Illegal_Minningవిశాఖ సముద్రతీరాన్న పచ్చటి ఋషికొండని వైసీపీ ప్రభుత్వం తవ్వేసి పెద్ద మట్టిదిబ్బగా మార్చేసిందనే విషయం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికీ తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అదొక్కటే కాదు… ఇంకా అనేక కొండలను వైసీపీ నేతలు తవ్వేసుకొంటున్నారని టిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ సెల్ఫీలతో చూపించారు.

యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం మదనపల్లి నియోజకవర్గంలో వెంకటప్పకొండ గ్రామం చేరుకొన్నప్పుడు, స్థానిక రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మెహబూబ్ బాషా అనే ఓ రైతు తన రెండెకరాల పొలాన్ని ఆనుకొని ఉన్న పెద్ద కొండను చూపించి, స్థానిక వైసీపీ నేతలు గత అనేక నెలలుగా కొండను తవ్వేస్తూ వందలాది టిప్పర్లలో గ్రావెల్ తరలించుకుపోతున్నారని తెలిపారు. అయితే ఈ విషయం మీడియా తెలియజేసినా లేదా నష్టపరిహారం కోరవద్దని అధికారులు తనని హెచ్చరించారని బాషా చెప్పారు. టిప్పర్లు తిరుగుతుండటం వలన తన పొలంలో వ్యవసాయం చేసుకోలేకపోతున్నాని, వాటిని ఆపితే వైసీపీ నేతలు, అధికారులు వచ్చి బెదిరిస్తున్నారని బాషా చెప్పారు.

దారిలో తనకు అనేక టిప్పర్లు ఎదురయ్యాయని అవన్నీ వైసీపీ నేతలవేనని నారా లోకేష్‌ బాషాకు చెప్పారు. వాటితో కూడా సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యువగళం పాదయాత్ర ముగిసిన తర్వాత వచ్చి ఈ సమస్యపై పోరాడుతానని నారా లోకేష్‌ అతనికి హామీ ఇచ్చారు.