Nara Lokesh tweets on ys jagan allegationsతెలుగుదేశం పార్టీ మొత్తానికి అభిమానుల మొర ఆలకించినట్టుగా కనిపిస్తుంది. గత మూడు రోజులుగా నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. లోకేష్ ట్వీట్స్ అధికార పార్టీ మీద పూర్తి అగ్రెస్సివ్ గా సాగుతున్నాయి. తాము అవినీతిలో నిండా మునిగి ఇప్పుడు తెలుగుదేశం మీద ఆ మకిలి అంటించాలనే ప్రయత్నం జరుగుతుందని దానిని సమర్థవంతంగా తిప్పి కొట్టగలమని టీడీపీ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జ‌గ‌న్ గారూ! @ysjagan గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించ‌లేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్‌స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారు. దేవుడు కామా త‌రువాత మ‌ళ్లీ స్క్రిప్ట్ రాయ‌డం మొద‌లుపెట్టాడు. మీరు అవినీతి అన్న ప‌ట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డ‌గోల‌న్న పోల‌వ‌రం అంచ‌నాలను య‌థాత‌థంగా కేంద్రంతో ఓకే చేయించాడు,” అంటూ ట్వీట్ చేసారు లోకేష్

అదే విధంగా, “టీడీపీ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే… అవి ముట్టుకుంటే షాక్ కొడ‌తాయ‌ని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి. భ్ర‌మ‌రావ‌తి అన్న మీ భ్ర‌మ‌లు తొల‌గించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం సీటులో కూర్చున్న‌ప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టిన‌ప్పుడైనా చంద్ర‌బాబుగారికి మ‌న‌సులో కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మ‌ళ్లీ కామా పెట్టాడు,” అని ఘాటుగా విమర్శించారు లోకేష్. మొత్తానికి దేవుడిని కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భాగస్వామిని చేసేశారు రెండు పక్షాలు.