Nara Lokesh- Thanks to director rajamouliఓ పక్కన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై వీరలెవల్లో విరుచుకుపడుతుండగా…. బుధవారం నాడు ఉదయం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి విశాఖ రోడ్లను అభినందిస్తూ ట్వీట్ చేసిన వైనం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ట్వీట్ లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఏమీ ప్రశంసించకపోయినప్పటికీ, పరోక్షంగా అదే భావం వచ్చింది.

క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచిన ఉడాను అభినందిస్తూ చేసిన ఆ ట్వీట్ కు నారా లోకేష్ ప్రతిస్పందించారు. ‘అలా చెప్పినందుకు గానూ రాజమౌళి గారికి ధన్యవాదాలు’ అంటూ లోకేష్ రిప్లై ఇచ్చారు. ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా రాజమౌళి ట్వీట్ టిడిపి పాలనకు మార్కింగ్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదు. అవకాశం వచ్చిన చోట రాజకీయ నాయకులు ఎందుకు వదిలేస్తారు? లోకేష్ కూడా అదే పనిచేసారు.

ఏపీ అసెంబ్లీ డిజైన్ కు గానూ రాజమౌళి తన సూచనలు, సలహాలను చంద్రబాబు సర్కార్ కు అందించిన విషయం తెలిసిందే. ఆ రకంగా తెలుగుదేశం పాలనను కాస్తో కూస్తో దగ్గర నుండి చూసిన వ్యక్తి రాజమౌళి. అలాంటి జక్కన్న నుండి అభినందిస్తూ ట్వీట్ రావడం అంటే చెప్పుకోదగ్గ విషయమే, అందుకే లోకేష్ బాబు రిప్లై ఇచ్చారు.