Nara Lokesh Telangana Governmentవరుసగా ఏడవ సారి నారా లోకేష్ తమ ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ జీఈఎస్ సదస్సుకు చంద్రబాబును పిలవకపోవడంపై స్పందించారు. దీనిని వివాదం చేయడం సరికాదని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. దానిని అనుమానించాల్సిన విషయం ఏమీ లేదన్నారు.

“జీఈఎస్ సదస్సు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో సదస్సు జరపాలని నిర్ణయించుకుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే పిలుస్తుంది. జీఈఎస్‌కు చంద్రబాబును మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందలేదు,” అని లోకేశ్ చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ కు చంద్రబాబు ఏం చేసారో అందరికి తెలుసని. హైదరాబాద్ మెట్రో, ఎయిర్ పోర్ట్, జీఈఎస్ జరిగిన హెచ్ఐసిసి అన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు తెచ్చినవే అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం తమ మీద ఉందని లోకేష్ అన్నారు.