Nara Lokesh 2.0- Inspires Confidence in -Cadreగత ఎన్నికలలో తెలుగుదేశం ఓటమికి నారా లోకేష్ కూడా ఒక కారణమే అని చాలా మంది అంటున్నారు. లోకేషే టార్గెట్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పని చేసినా సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో పార్టీతో పాటు లోకేష్ కూడా ఫెయిల్ అయ్యారు. అయితే ఓటమి నుండి పాఠం నేర్చుకున్న లోకేష్… టీడీపీకి పూర్వవైభవం తీసుకునిరావడానికి కష్టపడుతున్నాడు.

ఇటీవలే జరిగిన శాసనసభ సమావేశాలలో లోకేష్ ఇరగదీశాడు. విషయ పరిజ్ఞానం తో పాటు మెరుగైన వాగ్ధాటితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సమావేశాలు పూర్తయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లోని ముంపు బాధిత ప్రాంతాల పర్యటనకు వెళ్ళాడు. అక్కడ ఉండగానే… నిన్న రాత్రి నుండి ఏలూరులో ఉన్నట్టుండి 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

కళ్లు తిరగడం, మూర్ఛ లాంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఉన్నఫళంగా లోకేష్ అక్కడ వాలిపోయి బాధితులను పరామర్శిస్తున్నాడు. లోకేష్ స్పీడ్ కు టీడీపీ అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇలాగే నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యల పై పోరాడాలని అంటున్నారు. “వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళనగా ఉంది. కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం.దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి,” అంటూ విమర్శించారు లోకేష్.