nara-lokesh-tdp-andhra-pradeshఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తన చరిత్రలోనే ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది టీడీపీ. జగన్ వేవ్ లో తెలుగుదేశం పార్టీ టీడీపీ కంచుకోటలు కూడా కొట్టుకుపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి నారా లోకేష్ కూడా దారుణమైన ఓటమి మూటగట్టుకున్నారు. గత ఎన్నికలలో కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచినా ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఈ సారి ఏకంగా 5000 పైచిలుకు ఓట్లతో నారా లోకేష్ మీద గెలిచి మంత్రి కూడా కాబోతున్నారు.

అయితే ఇప్పుడు లోకేష్ భవితవ్యం ఏమిటనేది చూడాలి. లోకేష్ గనుక గెలిచి ఉంటే ఆయనను ప్రతిపక్ష నేత చేసే వారు చంద్రబాబు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో తానే రంగంలోకి దిగారు. లోకేష్ గతంలో తనకు ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యలేదు. ఎమ్మెల్యేగా గెలవలేదు గనుక దానిలో కొనసాగవచ్చు. అయితే అది ఖచ్చితంగా పరువు తక్కువ విషయమే అవుతుంది. అసెంబ్లీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కి మెజారిటీ ఉన్నా మండలిలో టీడీపీదే పట్టు ఇప్పటికీ.

దీనిని వాడుకుని లోకేష్ తన ఇమేజ్ బిల్డ్ చేసుకుంటారా? రాజీనామా చెయ్యాలని డిమాండ్లు వచ్చినా ఇప్పుడు రాజీనామా చేస్తే ఆ సీటు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలోకి పోతుంది. కాబట్టి రాజీనామా చెయ్యకుండా సమావేశాలకు హాజరు కాకుండా కూడా ఉండవచ్చు. అయితే పూర్తిగా ప్రజలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ క్రమంలో లోకేష్ దేనిని ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. ఏ ఆప్షన్ ను ఎంచుకున్నా ఏదో ఒక ఇబ్బంది ఉండటం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితికి నిదర్శనం.