Nara_Strong_Comment_On_YS_Jagan
టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు పీలేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఓ నాలుగైదు రోజులు పాదయాత్ర చేసి ఇక చేయలేక ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడని వైసీపీ నేతలనుకొంటే 37వ రోజులు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసి తొలిరోజు ఎంత ఉత్సాహంగా ప్రారంభించారో నేడు అంతకంటే ఎక్కువ ఉత్సాహంతోనే ముందుకు సాగిపోతున్నారు. యువగళం పాదయాత్రకి ప్రజల నుంచి ఊహించిన దానికంటే మంచి ప్రజాధారణ లభిస్తుండటం, వైసీపీ ప్రభుత్వం సృష్టిస్తున్న అవరోధాలతో ఈ పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయాలని నారా లోకేష్‌ పట్టుదల పెరగడం, ముఖ్యంగా టిడిపి శ్రేణులలో కనిపిస్తున్న ఉత్సాహం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

నారా లోకేష్‌ పాదయాత్ర మొదలుపెట్టిన కొత్తలో మంత్రులు పోటీలుపడి నారా లోకేష్‌ని అవహేళన చేశారు. కానీ కొలిమిలో కాలిన కత్తిలా పదునుతేరిన నారా లోకేష్‌ విసురుతున్న సవాళ్ళకు జవాబులు చెప్పలేక అందరూ సైలెంట్ అయిపోయారు. మొదట్లో పోలీసులతో నారా లోకేష్‌ని అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది. కానీ ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గిన్నట్లు కనబడుతోంది. ఎందుకంటే, నారా లోకేష్‌ని పోలీసులతో అడ్డగించడం వలన, మంత్రులతో విమర్శలు చేయించడం వలన ఆయనకు తామే ఉచితంగా పబ్లిసిటీ చేస్తున్నామనే విషయం వైసీపీ ప్రభుత్వం కాస్త ఆలస్యంగా గ్రహించిన్నట్లుంది.

నారా లోకేష్‌ని అడ్డగించినప్పుడు ఆయన వారికి రాజ్యాంగం పుస్తకం చూపిస్తూ, “మీరు ఈ రాజ్యాంగాన్నే ఫాలో అవుతున్నారా లేక రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా?” అంటూ ప్రశ్నించినప్పుడు పోలీసులు జవాబు చెప్పలేకపోవడం వైసీపీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమే.

అలాగే నారా లోకేష్‌ టిడిపి హయాంలో స్థాపించిన పరిశ్రమల వద్ద, అలాగే వైసీపీ నేతల అక్రమ క్వారీలు, అక్కడ తిరుగుతున్న వారి లారీల వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతూ ఆ సాక్ష్యాధారాలతో సహా సవాళ్ళు విసురుతుంటే వాటికి జవాబు చెప్పుకోవడం మంత్రులకు ఇబ్బందికరంగానే ఉంటోంది. కనుక నారా లోకేష్‌కు దూరంగా ఉంటూ, పాదయాత్రని పట్టించుకొన్నట్లు ఉండటమే మంచిదని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బహుశః ఇది ఐ-ప్యాక్ సూచన కావచ్చు.

ఏది ఏమైనప్పటికీ, నారా లోకేష్‌ ఉత్సాహంగా యువగళం పాదయాత్రలో ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వివిద కులమతాలు, వివిద వర్గాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొంటూ, టిడిపి, వైసీపీ ప్రభుత్వాలకు, పాలనకు తేడాని వివరిస్తూ ముందుకు సాగిపోతున్నారు.

ఇటీవల పాదయాత్రలో ప్రజలను ఉద్దేశ్యించి నారా లోకేష్‌ మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడుకి వ్యవసాయం, రైతులు ఎదుర్కొనే సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. అలాగే ఆయన మంత్రివర్గంలో తొలుత వ్యవసాయశాఖ మంత్రిగా చేసిన పుల్లారావు, ఆ తర్వాత చేసిన సోమిరెడ్డి ఇద్దరూ కూడా వ్యవసాయం, రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారు. కానీ మన వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టు దొంగ. ఏవిదంగా అంటే, సాధారణంగా నేరం చేసినవారు పోలీస్ స్టేషన్‌లకి అక్కడి నుంచి కోర్టులకు వెళుతుంటారు. కానీ మన మంత్రి కాకాణి మాత్రం కోర్టులో ఉన్న తన కేసుకు సంబందించిన ఫైలునే దొంగతనం చేయించిన ఘనుడు. అప్పుడు సోమిరెడ్డి గట్టిగా న్యాయపోరాటం చేసి ఈ దొంగతనంపై సీబీఐ చేత విచారణ జరిపేలా చేశారు. టిడిపి మంత్రులకి, వైసీపీ మంత్రులకు తేడా ఇదే,” అని నారా లోకేష్‌ వివరించారు.

ఈరోజు పీలేరు భారీగా తరలివచ్చిన ప్రజలు తరలివచ్చారు. అప్పుడు నారా లోకేష్‌, “మైడియర్ జగన్, ఐయామ్ నాటే టెర్రరిస్ట్… ఐయామే వారియర్!దమ్ముంటే రా… నన్ను ఎదుర్కో,” అంటూ పులిలా గర్జించారు.