Nara Lokesh satires on AP Governmentచిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే, అలాగే మరికొంతమంది క్షతగాత్రులయ్యారు. ఈప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి 50 వేలు ఆర్ధిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే తరహా పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి బాధితుల కుటుంబాలకు ప్రకటించారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే తరహా బస్సు ప్రమాదం జరుగగా, మృతి చెందిన కుటుంబాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 5 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం చాలదు, కనీసం తక్కువలో తక్కువ 20 లక్షలు ప్రకటించాలని, అది కూడా సదరు బస్సు యాజమాన్యం వద్ద నుండి రాబట్టాలని చెప్పి జగన్ తన విశాల హృదయాన్ని చాటుకున్నారని, సోషల్ మీడియాలో అప్పటి జగన్ ప్రసంగాన్ని తెలుగు తమ్ముళ్లు వైరల్ చేస్తున్నారు.

జగన్ మోసపు రెడ్డి మాటలు కోతలు దాటతాయి…. చేతలు తాడేపల్లి ప్యాలస్ కాంపౌండ్ కూడా దాటవని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన సోషల్ మీడియాలో “నాడు – నేడు” అంటూ ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాట మార్చడంలో ఏపీ సీఎం తర్వాతే ఎవరైనా అనుకోవడం నెటిజన్ల వంతవుతోంది.

విషయానికి వస్తే.., జగన్ నాడు చెప్పిన నీతులు.., బస్సు యాజమాన్యం నుంచి కనీసం 20 లక్షల కాంపన్సేషన్ ప్రభుత్వం బాధితులకు ఇప్పిస్తేనే ఇటువంటి ప్రమాదాలను నివారించగలం. అలా కాకుండా ఇదే మాదిరి బస్సు యాజమాన్యాలను ప్రొటెక్ట్ చేస్తా వుంటే “ఈ పొద్దు” వాళ్ళు, వాళ్ళ పిల్లలు., రేపు మనం, మన పిల్లలు, పెళ్ళాలు అంటూ టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

కానీ బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు జగన్ 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయంతో బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు అంటూ భజన కార్యక్రమాలు మొదలు పెట్టారంటూ లోకేష్ సెటైర్లు వేస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో బస్సు యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్న జగన్ ఇప్పుడు మాత్రం ఆ వాహన యజమానుల గురించి నోరు మెదపకపోవడం దేనికి సంకేతం? అందుకే తమ పార్టీ జగన్ కు జగన్ ‘మోసపు’ రెడ్డి అని నామకరణం చేసింది.

“ఆ పొద్దు ఒక మాట – ఈ పొద్దు మరో మాట” అంటూ పొద్దు గడిస్తే జగన్ కు ఇచ్చిన మాట., చేసిన హామీలు గుర్తు రావని సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం పైన.,ముఖ్యమంత్రి జగన్ మీద మేమ్స్ తో టీడీపీ సందడి చేస్తోంది.