Nara_Lokesh_Palnadu_Tourతెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ గురువారం పల్నాడు జిల్లాకు వచ్చినప్పుడు జనాలు నీరాజనాలు పలికారు. ఇటీవల రాజకీయ ప్రత్యర్దుల చేతిలో దారుణంగా హత్యకు గురైన టిడిపి కార్యకర్త జలయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్‌ పిడుగురాళ్ళకు బయలుదేరగా ఆయనను అడ్డుకొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా దారిపొడవునా వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి పోలీసులు వెనక్కు తగ్గారని నారా లోకేష్‌ ట్వీట్ చేశారు. పల్నాడులో ప్రజలు, పార్టీ కార్యకర్తలు చూపిన ఈ అభిమానం తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని చెపుతూ నారా లోకేష్‌ అందరికీ ట్వీట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో శుక్రవారం టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య (38)ను వారి ప్రత్యర్ధి వర్గం బందించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి అతికిరాతకంగా కత్తులు గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికే నారా లోకేష్‌ పిడుగురాళ్ళకు వెళ్ళగా అక్కడ అడుగడుగునా ఆయనకు జనాలు నీరాజనాలు పట్టారు.