Nara Lokesh recollects YS jagan speech before elections2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 151 సీట్లు ఇచ్చి ప్రజలు తమను ఆశీర్వదించారని, మూడు రాజధానుల నిర్ణయానికి ఇంతకుమించిన ఆమోగ్యత ఇంకేమీ ఉండదన్నట్లుగా అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను నారా లోకేష్ తిప్పికొట్టారు.

“తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారు. అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి 3 రాజధానుల కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పడం హైలైట్. మురుగు బుర్రలకు మెరుగైన ఆలోచనలు ఎప్పటికీ రావు” అంటూ నారా లోకేష్ జగన్ స్పీచ్ పై స్పందించారు.

ఎన్నికల సమయంలో 3 రాజధానులన్న విషయం జగన్ ఏ ఒక్క రోజు కూడా ప్రస్తావించలేదు. నిజానికి అసలు ఆ ఆలోచన ఏపీ రాజకీయాల్లో ఏనాడూ చర్చ జరగలేదు. 3 రాజధానుల అంశం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం.

అందుకు నిదర్శనంగా 151 సీట్లు ప్రజలు ఇచ్చారని చెప్పడం జగన్ అవివేకానికి అద్దం పడుతుందే తప్ప, అందులో ఏ మాత్రం నిజం లేదన్నది లాజిక్ తో కూడిన లోకేష్ చేస్తోన్న విమర్శ. ఈ సందర్భంగా అమరావతిపై గతంలో జగన్ చెప్పిన వీడియోను కూడా పోస్ట్ చేసారు లోకేష్.