Nara Lokesh helps handicaped personతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ మొన్నటి ఎన్నికలలో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయినా నియోజకవర్గాన్ని వదలకుండా తన పరిధిలోని విషయాల పట్ల లోకేష్ శ్రద్ద పెడుతూనే ఉంటారు. తాజాగా ఆ నియోజకవర్గానికి చెందిన నందం నాగరాజు అనే వ్యక్తి ఒక ట్రైన్ ఆక్సిడెంట్ లో తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.

అతను ఒక నిరుపేద కూలి. ట్విట్టర్ లో అతని సమాచారం ప్రకారం కొందరు దాతలు సాయం చేశారు. అలాగే అతని దుస్థితిని లోకేష్ దృష్టికి తీసుకుని వచ్చారు కొందరు. విషయం తెలుసుకున్న లోకేష్ ఆయనకు సాయం చేస్తా అని ట్విట్టర్ లో ప్రకటించారు.

అలా ప్రకటించిన రెండు గంటలలోనే బాధితుడికి సాయం అందడం విశేషం. వెంటనే అతని వద్దకు నియోజకవర్గ నాయకులను పంపి అతనికి 15,000 ఆర్ధిక సాయం అందించారట. అలాగే అతనికి ఉద్యోగం కూడా ఇప్పిస్తా అని మాట ఇచ్చినట్టు సమాచారం.

ఆర్ధిక సాయం చెయ్యమని అడిగితే… అడగకుండానే అతని బ్రతుకుతెరువు గురించి కూడా ఆలోచించిన మంచి మనిషి లోకేష్ అంటూ అందరు పొగడటం విశేషం. ఓడిపోయిన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చెయ్యడం మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇది ఇలా ఉండగా… వచ్చే ఎన్నికలలో కూడా లోకేష్ అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని సమాచారం. సహజంగా పెద్ద నాయకులు ఒకసారి ఓడిపోయిన నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చెయ్యరు. అయితే లోకేష్ మాత్రం మంగళగిరికే కట్టుబడతారట.