Nara Lokesh delivers his first speech in Andhra Pradesh Assemblyనారా లోకేష్ మంత్రి పదవి స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఏపీ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలి రోజున మాట్లాడిన ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు శాసనసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానమిచ్చారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంపై ప్రశ్నోత్తరాల్లో భాగంగా లోకేష్ సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, సీనియర్ సభ్యులతో కలిసి సభలో భాగస్వామ్యం కావడం అదృష్టమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. లోకేష్ మాట్లాడుతుంటే సభ్యులంతా ఆసక్తికరంగా విన్నారు. మరోవైపు ఫిరాయించినవారిపై చర్య తీసుకోని స్పీకర్ విదానాలకు వ్యతిరేకంగా వైఎస్ ఆర్ కాంగ్ర్రెస్ పార్టీ సమావేశాలను బహిష్కరించింది.

అయితే పాదయాత్ర కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తేలికగానే అర్ధం అవుతుంది. ఆయన సభలో ఉండరు, అదే సమయంలో సభ నడపడానికి వేరే వాళ్ళకి అధికారం ఇవ్వడం ఇష్టం లేక జగన్ ఫిరాయింపుల వంకతో మొత్తానికి సమావేశాలని బహిష్కరించినట్టు సమాచారం.