Nara Lokesh Calls BJP as Bharatiya Jokers Partyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రత్యర్ధులు ఎంత విమర్శించినా, ఒక్కోసారి వ్యక్తిగతంగా మాటలు తూలినా ఆయన ఎన్నడూ నోరు జారకుండా జాగ్రత్త పడతారు. అయితే ఆయన కుమారుడు లోకేష్ మాత్రం దానిని విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్లో వాడుతున్న బాషా అభ్యంతరకరంగా ఉంది. చంద్రబాబు అవినీతి అంటూ వైకాపా వేసిన ఒక పుస్తకంపై లోకేష్ విమర్శలు చేసారు

“రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి జరిగింది అంటున్న జలగన్న కేర్ ఆఫ్ అడ్రెస్ త్వరలో పిచ్చాసుపత్రి కాబోతోంది,” అని నారా లోకేష్ ట్విట్టర్ లో రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి రాజకీయ ప్రత్యర్థి. ఒకరినొకరు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు. అయితే హోదాను మర్చిపోయి ‘జలగన్న’ అని వ్యవహరించడం ఏంటో? గతంలో జగన్, విజయసాయిరెడ్డి వంటి వారు ఇటువంటి భాషనే చంద్రబాబు, లోకేష్ పై వాడితే అందరూ ఖండించారు.